FbTelugu

ఆదాయం ఉన్నా.. అభివృద్ధి లేదు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలో ఆదాయం ఎక్కువ అని అయినా అభివృద్ధి మాత్రం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర పరిస్థితులపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు.

ఏడాది నుంచి రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయని అన్నారు. వైసీపీ అవినీతి, అరాచకాలు పెట్రేగిపోయాయని అన్నారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్షసాధింపుతో ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని అన్నారు.

You might also like