FbTelugu

పార్టీ మారే ఆలోచనే లేదు: మాజీ మంత్రి గంటా

విశాఖపట్నం: ఇప్పటి వరకు సుమారు వందసార్లు నేను పార్టీలు మారుతానని 2019 నుండి పుకార్లు పుట్టించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ మారే ఆలోచన ఉంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మైండ్ గేమ్ లాగే అనిపిస్తుందన్నారు. పార్టీలో చేరేందుకు నేను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలి. 2019 నుంచి ఎంతో మంది నా అనుచరులు పార్టీ మారారు, కాని నేను మారలేదన్నారు. నేను మార్టీ మారల్సీవస్తే అందరిని సంప్రదించే పార్టీ మారుతానని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.