అమరావతి: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉండగా వారిపై కేసుల పేరుతో వేధింపులకు పాల్పడడం తగదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు.
భూమిలేని పేదల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించే సమయం వచ్చిందని అన్నారు. చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందేమోనని రైతుల్లో ఆందోళన పెరిగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు కూడా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.