FbTelugu

నెలాఖరు వరకు నో ఫ్లైట్స్

న్యూఢిల్లీ: ఈ నెల (మే) 31 వరకు విమానయాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు విమానయాన సంస్థ తెలిపింది. దేశంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా గత కొంత కాలంగా విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రధాని మోది వరుసగా నాలుగవ సారి ప్రకటించిన లాక్ డౌన్ లో ఏమైనా సడలింపులు ఇస్తారేమోనని ఎదురు చూసిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.

You might also like