FbTelugu

దొంగ కేసులకు భయపడేది లేదు: లోకేష్

అనంతపురం: సీఎం జగన్ దొంగ కేసులు పెడితే భయపడేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 22 కేసులు పెట్టారని అన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు కాదని అన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో ఉండేవని అన్నారు. ఇప్పుడు ఏపీలోనూ చూస్తున్నామని అన్నారు. అన్నీ రాసుకున్నాం వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. తొందర్లోనే తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు.

You might also like