FbTelugu

పెంపుడు కుక్కకు విమానంలో `నో ఎంట్రీ`..

పెంపుడు కుక్కకు విమానంలో `నో ఎంట్రీ`.. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్న మహిళ.. అవాక్కవుతున్న నెటిజన్లు!
ఆస్ట్రేలియాకు చెందిన ఆ దంపతులు గతేడాది ఇండోనేసియాలోని ఓ వీధి కుక్కను చూసి ముచ్చపడ్డారు.. తమ దేశానికి తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నారు.. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో న్యూజిలాండ్ వరకు ఆ కుక్కను తీసుకెళ్లగలిగారు.. ఆస్ట్రేలియా విమానయాన అధికారుల నుంచి పర్మిషన్ వస్తుందని రోజుల తరబడి న్యూజిలాండ్‌లో నిరీక్షించారు.. ఎంతకీ అనుమతి లభించకపోడంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. ఆ కుక్క కోసం ఏకంగా ప్రైవేట్ జెట్ బుక్ చేశారు.. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్పటికైనా అనుమతి వస్తుందనుకునే లోపు ఓమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మూడో వేవ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో కార్బిన్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెట్ డాగ్ కోసం ఏకంగా రూ.24 లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసింది. త్వరలో క్రిస్మస్ రానున్న నేపథ్యంలో తన భర్త, పెంపుడు కుక్కతో పండుగ జరుపుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్బిన్ తెలిపింది. డబ్బు కంటే భర్త, పెంపుడు కుక్కతో పండుగ జరుపుకోవడమే తనకు ముఖ్యమని కార్బిన్ చెప్పుకొచ్చింది. పెంపుడు కుక్క కోసం కార్బిన్ చేసిన ఖర్చు గురించి విని కొందరు అవాక్కవుతున్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.