FbTelugu

విదేశీ కుక్కలకు యుఎస్ లో నో ఎంట్రీ

న్యూయార్క్: ఆరోగ్యంగా ఉన్న కుక్కలు కాకుండా రేబిస్ సమస్య ఉన్న వాటిని అమెరికా తీసుకువస్తున్నారని గమనించిన ఆ దేశం నిషేధం విధించింది. సుమారు వంద దేశాల నుంచి కక్కుల తీసుకురావడంపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశంలో ఇప్పటికే వచ్చిన కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ చేయించినట్లు సర్టిఫికెట్లు చూపించాలని పెంపకం దారులకు సూచించింది. ఈ నిబంధన జూలై 14వ తేదీ నుంచి అమలు చేసతున్నామని సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది.

అమెరికాకు ప్రతి ఏడాది 10 లక్షల కుక్కలు విదేశాల నుంచి రవాణా చేస్తారు. వీటిలో వంద దేశాల నుంచి వచ్చే కుక్కలపై నిషేధం ప్రభావం ఉండనున్నది. దారి చూపించే కుక్కలు, విదేశాల నుంచి కుక్కలతో వచ్చేవారికి మినహాయింపులు ఇవ్వనున్నారు. రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి వచ్చిన వాటిని ఈ మధ్య ఎక్కువగా తిప్పి పంపించారు. కుక్క వయస్సు నాలుగు నెలల కన్నా తక్కువ వయస్సు ఉన్నట్లు తప్పుడు సర్టిఫికెట్లు చూపించి తీసుకువస్తున్నారని విచారణలో వెల్లడైంది. విదేశీ కుక్కల నిషేధాన్ని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డగ్లస్ క్రాట్ స్వాగతించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.