FbTelugu

ఒక్క రూపాయి ఫీజు డాక్టర్ లేరు…

ప.గో. జిల్లా: సుమారు ఆరు దశాబ్దాలు నామమాత్రం ఫీజుతో పాలకొల్లులో వైద్యం చేస్తున్న డా.జిజియా (88) కన్నుమూసింది. పేదల డాక్టర్ గా పేరొందిన ఆమె హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు.

సంవత్సరం క్రితం వరకు కూడా ఆమె ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకునేవారు. అందరూ ఒత్తిడి చేయడంతో ఆమె రూ.5 చొప్పున తీసుకుంటున్నారు. జిజియా లక్షలాదిమందికి వైద్యం అందించారు. నాటి ప్రముఖ వైద్యులు డా. సౌభాగ్యాలక్ష్మి, మంగపతిరావు, విజయవాడ మాజీ మేయర్ డా. జంధ్యాల శంకర్, హృద్యోగ నిపుణులు డా. వెంకయ్య చౌదరి లు జిజియా కు సహాధ్యాయులే. జిజియా చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు.

ఈమె కుమారుడు తెలుగుజాతి ఉద్యమకారుడు, రచయిత చలసాని శ్రీనివాస్. రెండో కుమారుడు ఇండియన్ అర్ధో డెంటిస్ట్స్ సొసైటీ అధ్యక్షులు డా. శ్రీకృష్ణ. జిజియా భర్త గాంధీ కి కరోనా సోకడంతో పాలకొల్లులో చికిత్స పొందుతున్నారు.

You might also like