FbTelugu

చేప ప్రసాదం పంపిణీ ఉండదు: హరినాథ్

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ ఉండదని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో పలు విషయాలను వెల్లడించారు. తమ కుటుంబం ప్రతిఏటా ఉబ్బస

వ్యాధి గ్రస్తులకు మృగశిరకార్తె సందర్భంగా ఉచితంగా పంపిణీ చేసే చేపమందును ప్రభుత్వ ఆదేశాలతో ఈ సారి పంపిణీ చేయడం లేదని తెలిపారు. చేప ప్రసాదం తయారు చేస్తాం.. కానీ పంపిణీ చేయమంటూ తెలిపారు. ప్రత్యామ్నాయంగా అలోపతి వాడొద్దని సూచించారు. ఎవరైనా చేపప్రసాదం అని చెబితే విని మోసపోవద్దని సూచించారు.

You might also like