FbTelugu

డిక్లరేషన్ లేదు పాడు లేదు…: మంత్రి కొడాలి

అమరావతి: రాష్ట్రంలో ఏ ఆలయంలో, మసీదులో, చర్చీలో లేని డిక్లరేషన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎందుకుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.
డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనని, దీన్ని వెంటనే తీసేయాలని ఆయన సూచించారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా తిరుమలలో వెంకన్నను దర్శనం చేసుకుంటే అపవిత్రం అవుతుందా అని మంత్రి నాని ప్రశ్నించారు. ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ తిరుమలలో డిక్లరేషన్ గురించి మాట్లాడలేని, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కొడాలి నాని విమర్శించారు. దీని గురించి హిందుత్వ వాదులు, పూజారులు అడగడం లేదని చంద్రబాబు నాయుడు మాత్రమే అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.

ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా చర్చికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరు ప్రభువును నమ్ముతావా అని సంతకం అడగలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్లే నాయకుడికి డిక్లరేషన్ అడిగే హక్కులేదని, దేశంలో ఎక్కడా లేని సంప్రదాయం తిరుమలలో ఎందుకని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ సర్కారు వచ్చినందునే ఇప్పుడు టెస్ట్ చెయ్యాలి, బ్లడ్ తీయాలి అంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ను చంద్రబాబు ఎందుకు అడగ లేదని మంత్రి లేవనెత్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.