FbTelugu

కరోనా జాన్తానై… ఏపిలో ఇంటర్ షెడ్యూలు

విపక్షాలు, తల్లితండ్రుల వినతులు బుట్టదాఖలు

అమరావతి: దేశంలో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా నమోదు అవుతున్న ఏపి ప్రభుత్వం ఇంటర్ పరీక్షల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నది. ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, విపక్షాలు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు వాయిదా వేయాలని ఇప్పటికే వినతి చేశాయి. ఇంటర్ తో పాటు టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నది. కరోనా దృష్ట్యా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదనేది స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.