FbTelugu

ఆ రాష్ట్రాల్లో మరణాలు లేవు

న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ మరణాలు ఊహించని విధంగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా ఉంటున్నాయి.

ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉండడం గమనార్హం. త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, దాద్ర నగర్ హవేలి, లడఖ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం కరోనా మరణాలు సంభవించలేదు. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల వ్యవధిలో 3,60,960 కేసులు నమోదు కాగా, 3,293 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరుకోగా, ఇప్పటి వరకు 2,01,187 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 29,78,709 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.