FbTelugu

విమానాల్లో నో క్యాబిన్ లగేజీ

ముంబై: డొమెస్టిక్ విమానాల్లో ఇక నుంచి హ్యాండ్ లగేజీ మినహా క్యాబిన్ బ్యాగేజీ అనుమతించే అవకాశాలు లేవు.

ఈ నెల 17వ తేదీ తరువాత ఆరోగ్య సేతు యాప్ ఉండి, క్యాబిన్ బ్యాగేజీ లేకుండా ఉన్నవారినే ప్రయాణానికి అనుమతించడంతో పాటు టిక్కెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తారు. ప్రతి ప్రయాణీకుడికి 20 కేజీల హ్యాండ్ బ్యాగ్ ను అనుమతించనున్నారు. విమానం బయలుదేరడానికి కనీసం మూడు గంటల ముందే ఏయిర్ పోర్టులో ఉండాలి. వెబ్ చెక్ ఇన్ విమాన బయలుదేరే సమయానికి మూడు గంటల ముందే ప్రారంభించి, ఒక గంట ముందుగానే ఆపివేయాలి. విమానం బయలుదేరానికి ఒక గంట ముందు బోర్డింగ్ అనుమతించి, 20 నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు.

ఆరోగ్య సేతు యాప్ లో గ్రీన్ స్టేటస్, వెబ్ చెక్ ఇన్, బాడీ టెంపరేచర్ వచ్చిపోయే ప్రయాణీకులకు తప్పనిసరి చేయనున్నారు. ప్రయాణీకులతో పాటు కాక్ పిట్ సిబ్బంది, ఏయిర్ హోస్టెస్ లకు కూడా ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిసింది. 80 సంవత్సరాలు దాటిన ప్రయాణీకులకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్లు జారీ చేయరు. ఏయిర్ పోర్టులో ప్రవేశించే ముందు ఒకసారి, విమానం లో ఎక్కే ముందు మరోసారి బాడీ టెంపరేచర్ చెక్ చేస్తారు. విమానంలోని చివరి మూడు వరుసల సీటింగ్ ను ఖాళీగా పెడతారు. ఎవరైనా ప్రయాణీకుడికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే ఐసోలేషన్ కేంద్రంగా మారుస్తారు. మంచినీళ్లు తప్ప ఏ విధమైన ఆహారం సరఫరా చేయరు. విమానం సిబ్బందికి అందుబాటులో పీపీఈ కిట్స్ ను సమకూర్చనున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది.

You might also like