FbTelugu

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై నేడు ప్రకటన

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నేడు ప్రకటించనున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. వాయిదా తేదీ ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) నేడు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమైంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ పోటీచేసేందుకు సమాయత్తమవుతున్నారు.

షెడ్యూలు ప్రకటిస్తే ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

You might also like