FbTelugu

మొక్కల పేరుతో రూ.500 కోట్లు లూటీ: ఎంపీ అరవింద్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కల పేరుతో ఖర్చు చేసిన రూ.500 కోట్లు లూటీ అయ్యాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
ఒక లక్ష కోట్ల రూపాయలు దోచుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన విమర్శించారు. ఇవాళ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు తోలు తీస్తామంటున్నా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పౌరుషం లేకుండా నపూంసకులు మారారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానిన బఫూన్లను పాలిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలను కేసీఆర్, పోలీసు అధికారులు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఐరిస్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార కార్డులను సంపాదిస్తున్నారన్నారు. జనాభాలో ముస్లింల సంఖ్య పెరిగిందితప్ప, బుద్దితో పాటు చదువుల్లో ఏమాత్రం పెరగలేదని అరవింద్ ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలో కూడా బోగస్ అడ్రసులతో రోహింగ్యాలకు పాస్ పోర్టులు జారీ అవుతున్నాయన్నారు. రోహింగ్యాలు దేశ భద్రతకు, హిందువులకు ప్రమాదకరంగా మారారన్నారు. అన్ని విషయాలపై గొప్పలు చెప్పుకునే ఎచ్చుల మంత్రి కేటీఆర్ రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడ్డం లేదన్నారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కు ఏమైందని అరవింద్ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.