FbTelugu

నివర్ తో జాగ్రత్త…

అమరావతి: రాగల 6 గంటల్లో నీవర్ అతి తీవ్ర తుపానుగా‌ మారనున్నట్లు ఏపీ విపత్తుల విభాగం వెల్లడించింది.
కడలూర్ కి తూర్పు ఆగ్నేయం 240 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది.

రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. సహాయక చర్యలకోసం ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నా మన్నారు.
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల విభాగం కమిషనర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.