FbTelugu

వచ్చే నెలలో నితిన్ వివాహం?

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం ఖరారు అయింది.

జూలై నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూలుకు చెందిన షాలినితో నితిన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. గత ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. దుబాయ్ లో పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.

ఈలోపు లాక్ డౌన్ రావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఇరువైపులా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారంగానే వచ్చే నెలలో నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి పెళ్లి చేసుకుని నూతన జంట ఒక్కటి కానున్నారు.

You might also like