FbTelugu

నీతి ఆయోగ్ ఆఫీసు సీజ్

ఢిల్లీ: కరోనా వ్యాధి ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా అందరినీ ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నది. ఒక ఉద్యోగికి వైరస్ సోకడంతో నీతి ఆయోగ్ ఆఫీసునే సీజ్ చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు, ఆరోగ్య శాఖ మంత్రి ఉద్యోగికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా నీతి ఆయోగ్ లో పనిచేస్తున్న ఉద్యోగిని సోకింది. పాజటివ్ రిపోర్టు వచ్చిన వెంటనే నీతి ఆయోగ్ ఆఫీసు తాత్కాలికంగా మూసివేశారు.

లక్షణాలు కన్పించడానికి కొద్ది గంటల ముందు సదరు ఉద్యోగి విధులు నిర్వర్తించాడు. పాజిటివ్ సోకిన ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారికి, బిల్డింగ్ లో పని చేసేవారందరినీ  క్వారంటైన్ కు పంపించారు.  పాజిటివ్ కేసు నమోదు అయిన ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలియచేశారు. నీతి ఆయోగ్ కు ప్రధాన మంత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం 48 గంటల పాటు సీజ్ చేసి, శానిటైజ్ చేస్తారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నీతి ఆయోగ్ ఆఫీసులో శానిటైజ్ పనులు ప్రారంభించింది.

You might also like