FbTelugu

కైలాస ద్వీపంలో వారికి ప్రవేశం లేదు: నిత్యానంద

న్యూఢిల్లీ: కైలాస ద్వీపంలో భారత్ నుంచి వచ్చే భక్తులపై నిషేధం విధిస్తున్నట్లు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ప్రకటించారు. కోవిడ్ కేసులు భారత్ లో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

భారత్‌తో పాటు బ్రెజిల్, యురప్, మలేసియా నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధిస్తున్నట్టు తన ‘ప్రెసిడెన్షియల్ మేండేట్’లో నిత్యానంద పేర్కొన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కైలాస రాయబార కార్యాలయాలన్నా… తానే నేరుగా ‘ఎస్పీహెచ్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తున్నట్లు నిత్యానంద ట్వీట్ చేశారు.

అయితే ఈ ప్రకటనను చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. రకరకాల ఈమోజీలతో ఈ ప్రకటనను రీట్వీట్ చేస్తూ కామెడీ కామెంట్లు పెడుతున్నారు. మహిళలపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద 2019 పరారీలో ఉన్నాడు. ఈక్విడార్ తీరంలోని ఓ ద్వీపంలో తనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుని  తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ‘కైలాస’ ద్వీపాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక దేశంగా ప్రకటించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.