FbTelugu

తనకు పిచ్చెక్కిందంటూ.. నిర్భయదోషి మరో ఎత్తుగడ

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి కోర్టు ఉరిశిక్షను విధించింది. కానీ ఈ ఉరిశిక్ష అమలులో మాత్రం తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఇప్పటికే పలుమార్లు ఉరి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే దోషులు చట్టంలోని లోపాలను వాడుకుంటూ తమ ఉరిశిక్షను ప్రతిసారి వాయిదా వేయించుకుంటున్నారు. తాజాగా నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ తనను తీహార్ జైల్లో చిత్రహింసలు పెట్టారని, దాంతో తనకి పిచ్చెక్కిందని సుప్రీం కోర్టుకు తెలిపాడు. అయితే కేంద్రం మాత్రం అతనికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని కోర్టుకు తెలిపింది. భారత చట్టం ప్రకారం అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఉరితీయరు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More