FbTelugu

శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృతి

మద్యం దొరక్క మృత్యువాత

ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిది కు చేరింది. నిన్న అర్ధరాత్రి ముగ్గురు.. ఇవాళ మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

మృతుల్లో ముగ్గురు యాచకులు కాగా మరో ఆరుగురు గ్రామస్థులు ఉన్నారు. మద్యం దుకాణాలు లేకపోవడం, మందు అందుబాటులో లేకపోవడంతో యాచకులు, స్థానికులు మరో మార్గం లేక శానిటైజర్‌ తాగారు. శానిటైజర్ వికటించడం, గొంతు ఎండిపోవడంతో నిన్న సాయంత్రం ఒకరు స్థానిక పోలెరమ్మ గుడి వద్ద ఒకరు తొలుత మృతి చెందారు. అర్ధరాత్రి మరో ఇద్దరు మరణించగా.. ఇవాళ మరో ఆరుగురు మృతి చెందారు. మృతులు: అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60) ,  కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

వీళ్లు అందరూ మందుకి బానిసై రోజూ శానిటైజర్​ తాగుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మద్యం దొరక్కపోవడానికి కారణాలు కూడా పరిశీలిస్తున్నారు.

You might also like