FbTelugu

ఎట్టకేలకు బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గవర్నర్ ఆదేశం మేరకు పంచాయత్ రాజ్ శాఖ రమేష్ కుమార్ ను తిరిగి ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బాధ్వతలు చేపట్టారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయన ఇవాళ ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకున్నారు.

You might also like