FbTelugu

నిమ్మగడ్డకు మతిభ్రమించింది: ఎంపీ వీవీఎస్ రెడ్డి

న్యూఢిల్లీ: మానసికంగా సరైన విధంగా లేనివారు రాజ్యాంగ పదవుల్లో ఉండడం ప్రమాదకరమని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మెడికల్ బోర్డు కు సిఫారసు చేయాలని వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

నీతులు, ధర్మాలు, నిజాయితీ లు గురించి నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని అసలు ఆయన నిమ్మగడ్డ, కందగడ్డ, ఉల్లిగడ్డ, చామగడ్డో అర్గం కావడం లేదు. ఇంతకీ ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనరో, లేదా టిడిపి ఎలక్షన్ కమిషనరో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు కు ప్రతినిధి గా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనలో చంద్రబాబు ఆత్మ చంద్రముఖి గా ప్రవేశించి లకలకలక అని ఆడిస్తున్నదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.