FbTelugu

హైకోర్టులో నిమ్మగడ్డ మరో పిటిషన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఈసీ (ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో మారు హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలంటూ.. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. తాను విధులు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వకుండా.. తనకు ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొన్నాడు.

ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం ఆర్టికల్ 243(కే) ప్రకారం చట్టవిరుద్ధమని తెలిపారు. హైకోర్టు దీనిపై వెంటనే జోక్యం చేసుకొని నిధులు విడుదల అయ్యేలా ఆదేశించాలంటూ కోరాడు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలను ప్రతివాదులుగా చేర్చాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.