FbTelugu

నిమ్మగడ్డ విషం కక్కకూడదు: వీవీఎస్

అమరావతి: రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వం పై విషం కక్కవద్దని వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం పై మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం లేకపోయినా చంద్రబాబు నాయుడు తన మనుషులే అధికారులుగా ఉండాలని అనుకుంటున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలంగా తీర్పు వస్తే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని విజయసాయి అన్నారు.

వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు న్యాయస్థానం పై నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ను మేము కించపరచమని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మా నాయకుని పై అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగానే పొరడామని గుర్తు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పై గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందన్నారు. టీడీపీ కార్యకర్తలు నా పేరు తో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ సృష్టించి మా నాయకుడు జగన్  పైనే తప్పుడు పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మొదటి నుంచి భరోసా ఇస్తున్నామని, వారికి ఏం జరిగిన అండగా ఉంటామన్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు మా వాళ్ళు పోస్టులు పెట్టారు. నేను చెనిపోయాంతవరకు వైసీపీ లోనే ఉంటాను.. జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటాను అని విజయసాయి స్పష్టం చేశారు.

You might also like