FbTelugu

మార్చి 2 నుంచి మున్సిపాల్టీ ఎన్నికలు: నిమ్మగడ్డ

విజయవాడ: మార్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

వీలైనంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇవాళ ఆయన పురపాలక ఎన్నిలకపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గతంలో ఒత్తిళ్ల వల్ల నామినేషన్ల ఉపసంహరించుకున్న వారి విజ్ణప్తులపై చర్చిస్తాం అని ఆయన తెలిపారు. ఇక పురపాలికల్లో నామినేషన్లు వేయలేక పోయిన వారు రుజువులతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్ఈసీపై ఉందన్నారు. పురపాలిక ల్లో నామినేషన్ల ఫిర్యాదుల స్వీకరణ అంశాన్ని సంబంధించి 23లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రమేష్ అన్నారు.

పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలనూ నిర్విఘ్నంగా నిర్వహిస్తామని, పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయని, అవాంఛనీయ ఘటనల వల్ల ఒక్కచోట కూడా తిరిగి పోలింగ్ జరగలేదని, ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ వర్గాలు, ఓటర్లు గురుతర బాధ్యతతో వ్యవహరించారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామన్నారు. న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ ఎన్నికలకు కొన్ని అవాంతరాలు ఉన్నాయని, అవరోధాలు తొలగిపోయిన అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని రమేష్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.