FbTelugu

నిహారిక నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

– నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిహారిక సోదరుడు, టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ, మున్ముందు వెబ్ సిరీస్ లు, సినిమాలు అనే తేడా ఉండదని, వెబ్ సిరీస్ లు కూడా సినిమాల స్థాయిలో ఉంటున్నాయని అన్నారు. సినిమాల ద్వారా కొందరికే అవకాశం వస్తుందని, కానీ వెబ్ సిరీస్ ల వల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.

ఇక తన సోదరి నిహారిక గురించి చెబుతూ, ఆమెకు ఎప్పుడూ సొంత స్టైల్ ఉంటుందని, ఆమె పనితీరులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. తన కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలన్నీ తానే తీసుకుంటుందని వెల్లడించారు. ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ఏడాది కిందట చెప్పిందని, ఇటీవల ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ చూడగానే నిజంగా ఆశ్చర్యపోయానని వరుణ్ తేజ్ వివరించారు. ఇది ఓ సినిమాలా ఉందని అంటున్నారని పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.