FbTelugu

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ?

హైదరాబాద్: కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తుండడంతో పలు రాష్ట్రాల్లో రాత్రిపూట ఆంక్షలు విధిస్తూ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు సాయంత్రం 6 నుంచి మరికొన్ని రాష్ట్రాలు 8 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ప్యూ విధించాయి.
కరోనా వైరస్ నియంత్రణకు ఈ మార్గం మినహా మరోటి లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నది. గత రెండు వారాలుగా తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులపై నైట్ కర్ఫ్యూపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తరువాత సోమేష్ కుమార్ సిఎం కెసిఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.

ప్రధానంగా కేసుల పెరుగుదల, నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలు, నైట్ కర్ఫ్యూ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నారు. రంజాన్ మాసం కావడంతో కరోనా కట్టడి కి ఏమి అనుసరించాలనే దానిపై కూడా ఒక నిర్ణయానికి రానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.