FbTelugu

తెలంగాణలో 10వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ

జూన్ 16న తెరుచుకోనున్న విద్యా సంస్థలు
పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసుల తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేసి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలనే నిర్ణయానికి సర్కార్ వచ్చింది. పాజిటివ్ కేసులు 2 శాతం లోపే ఉండడంతో లాక్ డౌన్ ఎత్తేయనున్నారు.
సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుపరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుతం సాధారణ జనాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతిస్తూ, ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం అదనంగా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారు జాము 6 గంటల వరకు లాక్ డౌను అమలు చేస్తున్నారు.

కేసులు తగ్గుతున్నందున రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలనే యోచనకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సాధారణ ప్రజల రాకపోకలను నిషేధిస్తారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. మెట్రో రైలు, ఆర్టీసి బస్సులను సాయంత్రం వరకు అనుమతించనున్నారు.
వీటితో పాటు విద్యా సంస్థలను ఈనెల 16వ తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు మే నెలాఖరు వరకు ఇచ్చి, జూన్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా వేసవి సెలవులు జూన్ 15 వరకు పొడిగంచారు. ఈ నెల 16 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సిబ్బందిని పూర్తి స్థాయిలో అనుమతించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.