FbTelugu

పూణే లో రాత్రి కర్ఫ్యూ!

పూణే: కరోనా వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నియంత్రణలోకి రాకపోవడంతో పూణే నగరంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
గడిచిన మూడు నాలుగు రోజులుగా ప్రతి రోజు నగరంలో ఐదు వందల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం నాడు ఒక్కరోజే 850 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని భావించిన యంత్రాంగం రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని ప్రకటించారు. సోమవారం రాత్రి నుంచి అమలు చేస్తున్నామన్నారు.
కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవల్లో పాల్గొనే వారికి మినహాయింపునిచ్చారు. పూణే తో పాటు ముంబయిలో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.