FbTelugu

ఏపిలో నైట్ కర్ఫ్యూ మాత్రమే: సిఎం జగన్

అమరావతి: ఏపిలో ఇక నుంచి నైట్ కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంటుందని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇవాళ కరోనా పరిస్థితులపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

జూన్ 21వ తేదీ నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉంటాయన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి, 6 గంటలనుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ సడలింపు ఇస్తున్నామన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 మాత్రమే సడలింపులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయన్నారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని సిఎం ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.