FbTelugu

విరసం, హక్కుల నేతల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో విప్లవ రచయితల సంఘం (విరసం), పౌర హక్కుల సంఘం నాయకుల ఇండ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

గత ఏడాది నవంబర్ లో మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై రెండు రాష్ట్రాల్లో విరసం, పౌర హక్కుల నాయకుల నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను రాష్ట్రా ప్రభుత్వాలు ఎన్ఐఏ కు అప్పగించాయి. హైదరాబాద్ లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అడ్వకేట్ రఘునాథ్ నివాసంలో సోదాలు చేశారు. పీఎన్టీ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి కంప్యూటర్, ల్యాప్ టాప్, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు. అనంతపురం జిల్లా ప్రొద్దుటూర్ లో విరసం నేత వరలక్ష్మీ, విశాఖపట్నం లోని పిఠాపురం కాలనీలో న్యాయవాది కె.పద్మ, చిన వాల్తేర్ లో న్యాయవాది కె.ఎస్.చలం, కర్నూలులో సరం కార్యదర్శి పాణి, రాజమహేంద్రవరం లో ఎపిసిఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.