FbTelugu

వరుస డ్రోన్ దాడులపై ఎన్ఐఏ విచారణ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ దాడులపై కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతాదళం (ఎన్.ఎస్.జి) చెందిన స్పెషల్ స్వ్వాడ్ విచారణ చేస్తోంది.

జమ్మూ సైనిక వైమానిక స్థావరంలో ఆదివారం తెల్లవారు జాము రెండు డ్రోన్లు రెండు బాంబులు జార విడిచాయి. ఆరు నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే జమ్మూలోని మరో సైనిక స్థావరంపై డ్రోన్లు రాగా భద్రతా బలగాలు అప్రమత్తమై తిప్పికొట్టారు. రత్నుచక్, కలుచక్ సైనిక స్థావరంపై ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరపడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.