FbTelugu

ఏపి ప్రభుత్వానికి ఎన్.హెచ్.ఆర్.సి సమన్లు

న్యూఢిల్లీ: వైసిపి ఎం.పి రఘురామ కృష్ణరాజు కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సి) ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎం.పి అరెస్ట్ వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులకు స్పందించలేదు.

ఈ అంశంలో ఏపి హోం శాఖ కార్యదర్శి, డిజిపి లకు మరోసారి సమన్లు జారీ చేసింది. నివేదిక ఎందుకు జాప్యం అవుతుందోనని ఏపి హోం శాఖ అధికారులను నిలదీసింది. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఏపి హోం శాఖ కార్యదర్శి, డిజిపి ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.