FbTelugu

తెలంగాణ సర్కార్ కు ఎన్జీటీ నోటీసులు

ఢిల్లీ: తెలంగాణ సచివాలయంలో భవనాల కూల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వాయిదా వేసింది. మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో భవనాల కూల్చివేతపై పిటీషన్ వేశారు.

కరోనా సమయంలో పర్యవరణ నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపడుతున్నరంటూ ఎన్జీటిని ఆశ్రయించారు. చెరువు శిఖలో ఉన్న భూమిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయడం నిబంధనలకు విరుద్దమని పిటీషన్ లో వివరించారు.

You might also like