FbTelugu

ఇంటి పక్కనే టెన్త్ ఎగ్జామ్ సెంటర్

అమరావతి: ఏపీలో టెన్త్ విద్యార్థుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనున్నది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎస్సెస్సీ విద్యార్థుల పరీక్షా కేంద్రాల ఎంపికలో కీలక నిర్ణయం తీసుకోనున్నది.

విద్యార్థులు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా పట్టణాలు, నగరాలలో, మండల కేంద్రాలలో హాస్ట‌ల్స్ లో ఉండి పదో తరగతి చదివిన స్టూడెంట్స్ సొంత ఊర్ల‌కు వెళ్లిపోయారు. చదివిన పాఠశాల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటే అదే ప్రాంతంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాల్సి వస్తున్నది. మళ్ళీ వాళ్లను చదువుకున్న పాఠశాల ప్రాంతానికి రప్పించాల్సి ఉంటుంది.

ఈ సమస్యను అధిగమించేందుకు వీలైనంత మేరకు ఇంటికి సమీపంలోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేస్తున్నారు. ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఎంత మంది విద్యార్థులు ఉండాలి, ఎంత సిబ్బంది అవసరం అనే దానిపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

You might also like