హైదరాబాద్: పెళ్లైన నాలుగు రోజులకే నవవధువు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట ప్రగతినగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య(24) అనే యువతికి నాలుగు రోజుల క్రితమే(డిసెంబర్ 06న) వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది.
కాగా నిన్న ఉదయం సౌజన్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ కారణంగానే సౌజన్య ఆత్మహత్యకు యత్నించి ఉంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సౌజన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.