FbTelugu

నూతన ఎమ్మెల్సీ వాహనం నుజ్జునుజ్జు

హైదరాబాద్: శాసన మండలి ఆవరణలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి వాహనానికి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వాహనంలో లేదు.
డ్రైవర్ బదులు గన్ మెన్ నడపటం తో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదుపు తప్పడంతో ఎదురుగా ఉన్న గేటును ఢీకొట్టింది.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తనకు సంబంధం లేని పని చేయడమే కాకుండా ఎమ్మెల్సీ కారును నుజ్జునుజ్జు చేసిన కానిస్టేబుల్ పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ భానుప్రకాశ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.