FbTelugu

వాహన మిత్రకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చు: పెర్నినాని

అమరావతి: వాహన మిత్ర రెండోవిడత అమలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పెర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడత వాహన మిత్రను జూన్ 4న సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు.

అయితే ఈ నెల 26 లోపు కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 లోపు లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచినట్టు తెలిపారు.

You might also like