FbTelugu

న్యూయార్క్ సిటీ కోలుకుంటోంది…

కరోనా వైరస్ తో అల్లాడుతున్న న్యూయార్క్ మహా నగరానికి ఊరటనిచ్చే విధంగా మరణాలు తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వేల సంఖ్యలో ఉన్న మరణాలు కాస్త వంద లోపే పడిపోవడం ఒకింత ఉపశమనం కలిగించే అంశం.

న్యూయార్క్ నగరంలోనే ఇప్పటి వరకు 1.97 లక్షల మందికి కరోనా పాజిటివ్ సోకగా, 16,149 మృత్యువాత పడ్డారు. అయితే, ఇప్పుడక్కడ పరిస్థితి క్రమంగా కుదుట పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆదివారం నాడు కనిష్టంగా 84 మంది మాత్రమే చనిపోయారు. ఏప్రిల్ 8న ఏకంగా 799 మంది మరణించడం న్యూయార్క్ నగర చరిత్రలో ఓ రికార్డు బ్రేక్ చేసింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఏ రోజూ కూడా 100 మరణాలకు తక్కువ కాకుండా నమోదు కాలేదు. ప్రభుత్వం గట్టి నియంత్రణ చర్యలు తీసుకోవడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయడం, ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం వంటి చర్యల కారణంగా కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

You might also like