బెంగళూరు: త్వరలోనే విప్రో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెరగబోతున్నాయి. 2021 జనవరి 1వ తేదీ నుంచి అర్హత గల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధానంగా జూనియర విభాగం (బీ3 కంటె తక్కువ)లో జీతాలు పెంచనున్నట్లు పేర్కొంది. మధ్యస్థాయి విభాగం (సీ1 కంటే పైన) లోనూ వేతన పెంపుదల పరిశీలిస్తున్నారు. కాగా సీ1 విభాగంలో జూన్ 1 నుంచి పెంపును అమలుపర్చనున్నారు. బీ3 విభాగంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేస్తున్న వారిలో 80శాతం మంది బీ3లో పనిచేస్తున్నారు. ఆఫ్ షోర్ ఉద్యోగులకు 6-8 శాతం, ఆన్ సైట్ సిబ్బంది కి 3-4 శాతం జీతాలు పెరిగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా వేతనాలు పెంపుదల ఆగింది.
కంపెనీకి పాతిక సంవత్సరాల పాటు సేవలందించిన రోహిత్ అడ్లకా సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నారు. నూతన సీఈఓను నియమించే వరకు సీఓఓ బీఎం.భానుమూర్తి ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.