FbTelugu

ఇండియా ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్

న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్ట్ వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద అనుమతించింది.

ఇవాళ సమావేశమైన నిపుణుల కమిటీ ప్రయోగ ఫలితాల నివేదికలు, సమర్పించిన దరఖాస్తును పరిశీలించి ఆమోద ముద్ర వేసింది. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నది. ఇప్పటికే 30 కోట్ల డోసులను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఆమోదం తెలపగానే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.