FbTelugu

గుడిలో కొత్త విగ్రహాలు ప్రతిష్ట… ముగ్గురి అరెస్టు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొత్త విగ్రహాల ఏర్పాటు కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆలయంలో కొత్త విగ్రహాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కొత్తగా విగ్రహాలను ప్రతిష్టించిన కేసులో పోలీసులు దానికి కారకులను గుర్తించి పట్టుకున్నారు. అయితే విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పుత్తూరుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ ఘటనకు పాల్పడ్డారని ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. ఇంట్లో ఆర్ధిక సమస్యలు, అప్పులు, అన్నదమ్ములకు పెళ్లిళ్లు కాకపోవడంతో ఓ స్వామీజీని కలిశామని అన్నారు. దోషం ఉన్నందున అది పోవాలంటే శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలను పెట్టాలని ఆ స్వామిజి చెప్పాడన్నారు.
స్వామిజీ ఆదేశం మేరకు రెండు విగ్రహాలను పెట్టినట్లు అన్నదమ్ములు తెలిపారు. సెప్టెంబర్ 8న నిందితులు సెక్యూరిటీ కళ్ళు కప్పి విగ్రహాలను గుడిలో ప్రతిష్టించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాలకు వారితో పూజలు చేయించి రాష్ట్రవ్యాప్తంగా వివాదానికి తెరలేపిన స్వామిజీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.