FbTelugu

జనవరిలో కొత్త పార్టీ.. రజినీ సంచలన ప్రకటన

* తమిళనాడులో వేడెక్కిన రాజకీయం

చెన్నై: తమిళ స్టార్ సినీ హీరో రజినీ కాంత్ కొత్త పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. తాను జనవరిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలే రజినీ కాంత్ కొత్త పార్టీ ఏర్పాటుపై తన అభిమాన సంఘాల నాయకులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

ఆ సమావేశంలో తాను ఇప్పుడే పార్టీ పెట్టే యోచనలో లేనట్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఆయన మరోమారు రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పందించారు. డిసెంబర్ 31న వివరాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. బీజేపీతో పొత్తు లేకుండానే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. రజినీ తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.