FbTelugu

విజయవాడ ఏయిర్ పోర్టుకు నూతనశోభ

విశాఖపట్నం: గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్ వే , ఇతర అభివృద్ధి పనులను అధికారుల బృందంతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.డి.ఇంతియాజ్ పరిశీలించారు. రూ.470 కోట్లతో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మించారు.

మరో రూ.27 కోట్ల తో ఆప్రాన్ లింక్ టాక్సీ వే అభివృద్ధి చేశారు. రాబోయే 10 రోజుల్లో క్రొత్త రన్ వే ద్వారా రాకపోకలు ప్రారంభానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో బోయింగ్ 777, 747 అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయిని జిల్లాకలెక్టర్ ఎం.డి.ఇంతియాజ్ తెలిపారు.

You might also like