FbTelugu

జమ్ముకశ్మీర్ కు నూతన లెఫ్టినెంట్ గవర్నర్

జమ్ము కశ్మీర్ కు నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

1985 బ్యాచ్ గుజరాత్ ఐఏఎస్ అధికారి అయిన జీసీ ముర్ము, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలుత ఆర్థిక మంత్రిత్వ శాఖలో విధులను నిర్వర్తించినట్టు తెలుస్తోంది. ఈ నెల 8న కాగ్ హెడ్ రాజీవ్ మెహర్షి పదవీ కాలం ముగియనుండగా.. ఆపదవిని ముర్మకు ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

You might also like