FbTelugu

నూతన ఐజేయూ అధ్యక్షులుగా కె. శ్రీనివాస్ రెడ్డి

New-IJU-President-Sreenivas-Reddy

ఢిల్లీ: ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ రోజు ఐజేయూ జాతీయ కార్యవర్గ అత్యవసర సమావేశం దేవులపల్లి అమర్ రాజీనామాను ఆమోదించింది. ఆయన స్థానం లో యూనియన్ సీనియర్ నేత కె.శ్రీనివాస్ రెడ్డి ని నూతన అధ్యక్షునిగా కార్యవర్గం ఎన్నుకున్నది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు గా నియమితులు కావడంతో అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు అమర్ ఆగస్ట్ 29 వ తేదీన ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డిని టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ అభినందనలు తెలిపారు.

You might also like