FbTelugu

హైకోర్టు ఉద్యోగులకు నూతన మార్గదర్శకాలు

అమరావతి: కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువౌతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగులకు మార్గదర్శకాలను ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ విడుదల చేశారు. ప్రస్తుత కాలంలో హైకోర్టు అధికారులు, ఇతర సిబ్బంది కేంద్ర కార్యాలయం విడిచివెళ్లకూడదని తెలిపారు.

ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించనున్నట్టు రాజశేఖర్ తెలిపారు. విధుల్లోకి తిరిగి వచ్చేముందు తక్షణం క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు. హైకోర్టు ప్రవేశ మార్గం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపారు. కోర్టు వరండాలో జనసమూహం ఎక్కువగా ఉండకూడదన్నారు.

You might also like