FbTelugu

గుణశేఖర్, మహేష్ కాంబినేషన్ లో కొత్త చిత్రం

దర్శకుడు గుణశేఖర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో పౌరాణిక చిత్రం ప్రతాపరుద్రుడు చిత్రం తెరకెక్కుతున్నది. మహేష్ అభిమానులు సూపర్ కాంబినేషన్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తను షేర్ చేసుకుంటున్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అర్జున్, ఒక్కడు, సైనికుడు చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం అక్కినేని సమంతతో శాకుంతలం చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్రం షూటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత దగ్గుబాటి రానాతో మిరణ్యకశ్యప తీసే యోచనలో ఉన్నాడని చిత్రసీమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తయిన దీనిని సెట్ మీదికి తీసుకువచ్చే సమయంలో కరోనా మొదలుకావడంతో బ్రేక్ పడింది. మహేష్ బాబు ఓకే చెబితే ఈ రెండు చిత్రాల తరువాత ప్రతాపరుద్రుడు సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.