FbTelugu

వైరస్ కు కొత్త మందు… మార్కెట్లోకి 2డిజి ఔషధం

హైదరాబాద్‌: కరోనా వైరస్ బారిన పడిన వారికి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు వైద్యంలో పలు మార్పులు చేశారు. ప్రాణాల నుంచి ముప్పు తప్పించేందుకు డి.ఆర్.డి.ఓ 2డిజి తయారు చేసిన విషయం తెలిసిందే.

వైరస్ బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2-డీజీ’ ఔషధాన్ని ఇవాళ మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10 వేల సాచెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది. పొడి రూపంలో లభించే సాచెట్ ను నీటిలో కరిగించి తాగాల్సి ఉంటుంది. శరీరం లోపలికి వెళ్లిన ద్రావకం వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని, వైరస్ లు శక్తివంతం కాకుండా నిరోధిస్తాయి. అయితే ఇది వైరస్ తో కూడిన కణాల్లోకి చేరుకోవడం ఈ పొడి ప్రత్యేకత. వైద్యుల సలహా మేరకు దీన్ని ఉపయోగిస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.